అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ బదిలీ
అనంతగిరి: జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా(రెవెన్యూ) విధులు నిర్వహిస్తున్న లింగ్యానాయక్ బదిలీ అయ్యారు. చేసింది. రెండేళ్లపాటు జిల్లాలో సమర్థవంతంగా పని చేశారు. ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా ప్రభుత్వ నియమించింది.
ఎమ్మెల్యేకు రాములోరి ప్రసాదం అందజేత
యాలాల: ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని.. మండల పరిధి రాఘవపూర్ గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి(ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్, ఖమ్మం) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే పేరిట భద్రాచలం రాములోరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించానని, ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేశానని కమిషనర్ తెలిపారు. ఆయనతో పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సంఘ నాయకులు నర్సిరెడ్డి, అనిల్‌కుమార్ ఉన్నారు.
బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతి
దోమ: వాహనదారుడు ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన గుండాల గేట్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన తిమ్మప్ప(45), దోమ మండలం కొత్తపల్లి గ్రామంలోని బంధువు మల్లయ్య ఇంటికి వచ్చాడు. స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో కింద పడి, అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
అడవిపంది దాడిలో గొర్ల కాపరికి గాయాలు
దుద్యాల్: అడవిపంది దాడిలో మేకల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండల పరిధి సంట్రకుంటతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన కిషన్ నాయక్.. రోజులాగే మేకలను మేతకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని కందిపొలం జీవాలు మేత మేస్తుండగా.. ఆడవిపంది కిషన్‌పై దాడి చేసింది. కరిచి తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటనలో కాపరి కాలు, చెయ్యి విరిగింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాధితున్ని నారాయణపేట్ జిల్లా కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు.
వృద్ధురాలి మృతి
ఆలస్యంగా వెలుగులోకి
బషీరాబాద్: ఓ ఇంట్లో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని పర్వత్‌పల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బంకుల లక్ష్మమ్మ(66) ఒంటరిగా ఉంటోంది. కొడుకు కాశప్ప కుటుంబంతో కలిసి ఇబ్రహీంపట్నంలో స్థిరపడ్డారు. కూతురు నర్సమ్మ తాండూరులో ఉంటోంది. వీరు అప్పుడప్పుడు తల్లిని చూసేందుకు వచ్చి వెళ్తుంటారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి చూశారు. ఆమె శరీరం ఉబ్బి, కుళ్లిపోయి ఉండటంతో మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయి ఉంటుందని భావించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు గ్రామానికి చేరుకొని విలపించారు. సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. అస్తమా లేదా చలి తీవ్రతతో చనిపోయి ఉంటుందని స్థానికులు తెలిపారు.
ఘనంగా ఎల్లమ్మ జాతర
యాలాల: ఎల్లమ్మ జాతర ఘనంగా జరిగింది. మండల పరిధిలోని దేవనూరు గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. గ్రామస్తులు నెత్తన బోనంతో డప్పుచప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొన్నారు. ఈ సందర్భంగా పోతురాజు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సర్పంచ్ రేణుకాదేవి, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు ఆశన్న, మంత్రి వెంకటయ్య, యువ నాయకుడు కిరణ్, మెట్లి కృష్ణ, మహమూద్, సూర్యప్రకాష్ తదితరులు ఉన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ బదిలీ
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ బదిలీ
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ బదిలీ
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ బదిలీ


