6న బహిరంగ వేలం
అనంతగిరి: అనంతగిరిగుట్ట శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం వద్ద ఏడాది పాటు వాహనాల పార్కింగ్ డబ్బు వసూలుకు జనవరి 6వ తేదీ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్టీ పద్మనాభం, ఈవో నరేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు రూ.2 లక్షల నగదు డిపాజిట్‌గా చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు.
పరిగి: సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పరిగి పట్టణానికి చెందిన పీర్‌మహ్మద్‌ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఐ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని పేర్కొనారు. రైతు, కార్మిక సమస్యలపై సీపీఐ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందన్నారు.
ఎమ్మెల్యే సహకారంతో గ్రామాల అభివృద్ధి
తాండూరు రూరల్: ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జెన్నె నాగప్ప అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధి సర్పంచులు శివరాజ్, ఈడ్గి సరితగౌడ్, చరణ్‌సింగ్‌లను సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్, జగదీష్, పాండు, జగదీష్‌లు పాల్గొన్నారు.
6న బహిరంగ వేలం


