క్రిస్మస్ శుభాకాంక్షలు
స్పీకర్ ప్రసాద్‌కుమార్
అనంతగిరి: ఏసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకొని క్రిస్టియన్లకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు యావత్ ప్రపంచానికి మార్గదర్శకమన్నారు. క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
ట్రెయినీ కలెక్టర్ చంద్రకిరణ్
అనంతగిరి: లక్ష్య సాధనకు ఏకాగ్రత ఎంతో అవసరమని ట్రెయినీ కలెక్టర్ చంద్రకిరణ్ అన్నారు. బుధవారం పట్టణంలోని సిద్ధార్థ స్కూల్‌లో నిర్వహించిన ఎఫ్ 5(ఫుడ్ ఫెస్టివల్) కార్యక్రమాన్ని విద్యా సంస్థల డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయ సంకల్పం సాధించాలంటే ఏకాగ్రతతో సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ విద్యా సంస్థల డైరెక్టర్లు సీ వేణు గోపాల్‌రావు, ఆర్ బదరీనాథ్, కూర జయదేవ్, డా. పీ కృష్టారెడ్డి, ప్రిన్సిపాల్ సభిత రాణి, సిబ్బంది మంజుల జాదవ్, విద్యార్థుల తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అనంతగిరి: వినియోగదారుల హక్కులను కాపాడుతామని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుడు తను తీసుకున్న వస్తువుకు డబ్బులు చెల్లించిన రసీదు పొందాలన్నారు. వస్తువు నాణ్యతలో లోపం ఏర్పడితే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ మంగీలాల్, రేషన్ షాపు డీలర్లు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు.
దౌల్తాబాద్: కోస్గి పట్టణంలో బుధవారం నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మండలంలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు తరలివెళ్లారు. మండలంలోని 33 పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యులను ఆయా పంచాయతీల కార్యదర్శులు వాహనాల్లో తీసుకెళ్లారు.
తుక్కుగూడ: ఆశ కార్యకర్తల సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.లలితాదేవి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఆశ కార్యకర్తలకు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసులు చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలోని 1,358 మంది ఆశ కార్యకర్తలకు చీరలు అందజేశామని చెప్పారు. ఆశాలకు ప్రభుత్వం ఏటా ఒక జత యూనిఫాం రూపంలో చీరలను అందిస్తుందన్నారు. ఆశాలు గ్రామీణ స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ శుభాకాంక్షలు


