సహకారం అభినందనీయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి
● ఘనంగా వీడ్కోలు
అనంతగిరి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అయ్యారు. జ్యుడీషి యల్ అకాడమికి వెళ్తున్న ఆయన్ను బుధవారం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు. ఆయన మాట్లాడు తూ.. జిల్లా న్యాయవాదుల సహకారం బాగుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నరసింహ, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నరేందర్, జీపీ శ్రీనివాస్‌రావు, బార్ అసోసియేషన్ సంయుక్త కా ర్యదర్శి ఆనంద్, సీనియర్ న్యాయవాదులు పర మానందరావు, కమాల్‌రెడ్డి, యాదవరెడ్డి, లవకుమార్, గోపాల్‌రెడ్డి, సంపూర్ణఆనంద్ పాల్గొన్నారు.


