చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
యాలాల: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన యాలాల మండల కేంద్రంలో గురువారం వెలుగు చూసింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల గ్రామానికి చెందిన గుదిగే బాలకిష్టయ్య(39) బుధవారం సాయంత్రం ఇంట్లోంచి వరి కల్లం వద్దకు వెళుతున్నట్లు చెప్పి వెళ్లాడు. మరుసటి రోజు ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికారు. ఎక్కడ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో గ్రామ శివారులోని పర్దె కుంట గట్టుపై బాలకిష్టయ్యకు సంబంధించిన బట్టలు, సెల్‌ఫోన్‌ను గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో పర్దెకుంటలో ఎస్‌ఐ విఠల్‌రెడ్డి చెరువులోకి దిగి గాలింపు చేపట్టగా మృతదేహాం లభ్యమైంది. మృతుడికి భార్యతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


