● జిల్లా ఎన్నికల పరిశీలకులు
షేక్ హాస్మిన్ బాషా
● నామినేషన్ కేంద్రాల పరిశీలన
బొంరాస్‌పేట: గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు షేక్ హాస్మిన్ బాషా, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం ఎన్నికల వ్యయ పరిశీలకుడు మనోహార్ రాజుతో కలిసి వారు మండల కేంద్రంతో పాటు తుంకిమెట్ల, దుప్‌చర్ల, మహాంతిపూర్, జానకంపల్లి, బోట్లవానితండా, నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. నామినేషన్ల దాఖలు చేసే క్రమంలో కావాల్సిన ధ్రువప్రతాలను సమర్పణను అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. నామినేషన్‌ల ఫారాలను స్పష్టంగా చూసి వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే విధంగా సహకరించాలన్నారు. అభ్యర్థుల ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు. అభ్యర్థుల వ్యయ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. ఖర్చులను వివరాలను సమర్పించాలని లేనిపోతే గెలుపు రద్దు అవుతుందనే విషయాలను గుర్తు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అఽధికారి జయసుధ, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ వెంకన్న గౌడ్, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


