పేలిపోయిన వాషింగ్ మిషన్
అమీర్‌పేట: అమీర్‌పేట ధరం కరం రోడ్డులోని ఓ ఇంట్లో ఎల్‌జీ వాషింగ్ మిషన్ పేలిపోయింది.పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళకు గురై బయటకు పరుగులు తీశారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేకే ఎన్‌క్లేవ్ ఫ్లాట్ నెం.503లో గురువారం మధ్యాహ్నం ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషిన్ నడుస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వాషింగ్ మిషన్ పేలిపోయింది. ఈ సమయంలో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. తేరుకుని బాల్‌కానీలోనిలోకి వచ్చి చూడగా వాషింగ్ మిషన్ ఎక్కడికక్కడ విరిగి పోయి విడిబాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. లోపలి పేలుడు ధాటికి లోపల అత్యంత బరువుగా ఉన్న బ్యాటరీ సీలింగ్ తగిలి కింద పడిపోయింది.పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డామని మహిళ వాపోయింది. షార్ట్‌సర్క్యూట్ జరిగి కరెంటు వైర్లు కాలిపోతే ఇంట్లో అంతటా మంటలు వ్యాపించి కాలిబూడిదయ్యేదని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియరాలేదని,బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


