‘టీఈ పోల్’తో ఎన్నికల సమాచారం
● ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: టీఈపోల్ మొబైల్ యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ సమాచారం పొందవచ్చనని కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటరు స్లిప్పులు పొదవచ్చని, పోలింగ్ స్టేషన్ల వివరాలు తెలుసుకోవచ్చని, ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
మీడియా పాయింట్ ప్రారంభం
కలెక్టరేట్‌లో గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా తోకలిసి మీడియా పాయింట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మీడియా సెంటర్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అనంతరం షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని మీడియా పాయింట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. అనంతరం హెల్ప్ లైన్ సెంటర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు మనోహర రాజు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీపీఆర్ చెన్నమ్మ, ఉద్యాన వన శాఖ అధికారి సత్తార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోసెస్ తదితరులు పాల్గొన్నారు.


