కులవృత్తులకు ప్రోత్సాహం
మోమిన్‌పేట: మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని నందివాగు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను వదిలారు. అనంతరం మోమిన్‌పేట రైతు వేదికలో 48 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. దేవరంపల్లిలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల వృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని అన్నారు. చేపల పెంపకంతో మత్స్యకారులు ఆర్థిక ఎదుగుదల సాధించాలన్నారు. చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. గత ప్రభుత్వం కుల వృత్తులను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక పంట రుణాలు రూ.2 లక్షల వరకు మాఫీ చేయడం జరిగిందన్నారు. రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ సృజన సాహిత్య, ఎంపీఓ యాదగిరి, పీఆర్ ఎఈఈ ప్రణీత్‌కుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకర్, నాయకులు నరోత్తంరెడ్డి, సుభాష్, సురేందర్, మల్లారెడ్డి, సుభాష్‌గౌడ్, మహంత్‌స్వామి, సిరాజొద్దీన్, ఎజాస్, ఎరాజ్, బాల్‌రెడ్డి, బాబు, మత్స్య సహకార సంఘాల సభ్యులు రాజు, అంబదాసు తదితరులు పాల్గొన్నారు.


