
బాధ్యతగా పని చేద్దాం
● ప్రజా సమస్యలపై తక్షణం స్పందించాలి ● మున్సిపల్ కమిషనర్ యాదగిరి
తాండూరు టౌన్: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ యాదగిరి హెచ్చరించారు. శనివారం మున్సిపల్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఉద్యోగులు సమయపాలన పాటించడంతో పాటు ప్రజల సమస్యలను శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పనులను పెండింగ్‌లో ఉంచరాదన్నారు. వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. పన్నుల వసూలులో బిల్‌కలెక్టర్లు శ్రద్ధ వహించాలన్నారు. త్వరలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వార్డుల్లో చెత్త లేకుండా చూడాలన్నారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. తాగునీటి సరఫరా సక్రమంగా జరిగాలని ఆదేశించారు. వెలగని వీధి దీపాలను తక్షణం మార్చి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అన్ని విభాగాలు సమన్వంతో పనిచేయాలని సూచించారు. పనితీరు సరిగ్గా లేకుంటే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ మణిపాల్, ఏఈ ఖాజా హుస్సేన్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
పరీక్షలకు సన్నద్ధం కావాలి
మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్
పరిగి: విద్యార్థులు ఇప్పటి నుంచే పరీక్షలకు సన్నద్ధం కావాలని మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ సూచించారు. శనివారం మండలంలోని జాఫర్‌పల్లి మోడల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థుల ప్రగతి రిపోర్టు, రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా చదవాలి
పరిగి: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఇంటర్మీడియట్ జాయింట్ సెక్రటరీ జ్యోత్స్నరాణి అన్నారు. శనివారం పరిగి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే కష్టపడి చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్, మెడికల్ బోర్డు డీడీ విద్ద్యులత, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్లను బాగు చేయండి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
సదానందరెడ్డి
అనంతగిరి: మండలంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానందరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం రోడ్ల సమస్యలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వికారాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ నవీన్‌కుమార్, పార్లమెంట్ కో కన్వీనర్ అమరేందర్ రెడ్డి, సెన్సార్ బోర్డ్ మెంబర్ బసవలింగం, మాజీ కౌన్సిలర్ శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షుడు శివరాజ్, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, సుధాకర్, మండల అధ్యక్షులు శివరాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు గోపాల్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతగా పని చేద్దాం

బాధ్యతగా పని చేద్దాం

బాధ్యతగా పని చేద్దాం