
వ్యసనాలకు లోనుకావొద్దు
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి కొడంగల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీరాం దౌల్తాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శన
దౌల్తాబాద్: విద్యార్థులు వ్యసనాలకు బానిసకారాదని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కొడంగల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీరాం సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతలు, హక్కులు, విధుల గురించి తెలుసుకోవాలన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివిన చాలా మంది నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. మీరు కూడా భవిష్యత్‌లో ఆ స్థాయికి ఎదగా లని సూచించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. అనంతరం అడ్వకేట్లు చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో అడ్వకేట్లు వెంకటయ్య, బస్వరాజ్, రమేష్, ప్రిన్సిపాల్ వసంత తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రమైన నీరందించాలి
విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని న్యాయమూర్తి శ్రీరాం ప్రిన్సిపాల్‌కు సూచించారు. కళాశాలలోని ట్యాంక్ సరిగ్గా లేకపోవడంతో దాని గురించి ఆరా తీశారు. అనంతరం ప్రిన్సిపాల్ వసంత మాట్లాడుతూ.. దౌల్తాబాద్‌కు కళాశాల కొత్తగా మంజూరైందని తెలిపారు. ప్రస్తుతం నిధులు కేటాయింపు జరగలేదని వివరించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఫిల్టర్ నీరు అందిస్తున్నామని జడ్జికి వివరించారు. కళాశాలలో కొత్త ట్యాంక్ ఏర్పాటు చేయాలని సోమవారం కలెక్టరుకు లేఖ రాయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.