
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవాబుపేట: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం నవాబుపేట మండలం దాతాపూర్ గ్రామంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పశువుల పాక పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఎల్లకొండ గ్రామంలో పశువుల పాక నిర్మాణానికి పంచాయత్‌రాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, ఎంపీడీఓ అనురాధ, తహసీల్దార్ బుచ్చయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, ఏపీఓ లక్ష్మిదేవి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఎక్‌బాల్, నాగిరెడ్డి, బల్వంత్‌రెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.
కార్మిక సమస్యలు
పరిష్కరించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య
పరిగి: పట్టణంలోని అడ్డా కార్మికుల సమస్యల ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య కోరారు. శుక్రవారం అడ్డా కార్మికులతో మాట్లాడారు. పరిగి పట్టణంలో వందలాది మంది అడ్డా కార్మికులు ఉన్నారని తెలిపారు. వారికి కనీస సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పని చేయడం ద్వారా ప్రభుత్వానికి నిత్యం టాక్స్ రూపంలో కోట్లాది రూపాయలు వస్తోందన్నారు. కానీ వారి సంక్షేమం గురించి పట్టుంచుకోవడం లేదని తెలిపారు. మహిళా కార్మికులు పని కోసం అడ్డా వద్దకు వస్తే వారికి మూత్రశాలలు లేక తీవ్ర ఇబ్బంది పడుతు న్నారని అన్నారు. మున్సిపల్ అధికారులు వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. చాలా మంది కార్మికులు లేబర్ ఇన్సూరెన్స్ చేసుకోవడం లేదని వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు హ బీబ్, సత్తయ్య, రఘురాం, శ్రీను, జగదీష్, బాబయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
ఉత్సవాలుప్రశాంతంగా జరగాలి
డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు టౌన్: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు డీఎస్పీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక మండపాలు ఏర్పాటు చేసే వారు విధిగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు నిషేధమన్నారు. ఉత్సవాల సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సమితి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సిములు మాట్లాడుతూ.. ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగేలా సమితి తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈసారి నాల్గవ రోజే వినాయక లడ్డూ వేలం పాట ఉంటుందన్నారు. లడ్డూ ద క్కించుకున్న వారు ఐదవ రోజు పూజా కార్యక్రమాల అనంతరం లడ్డూను తీసుకెళ్లాలన్నారు. దీనివల్ల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తి చేసుకోవడానికి సమయం సరిపోతుందన్నారు. అనంతరం సమితి సభ్యులు డీఎస్పీ, పట్టణ సీఐ సంతోష్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు.
25న సత్యాగ్రహ దీక్ష
తాండూరు టౌన్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేష న్లు కల్పించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇదే అంశంపై ఈనెల 25న హైదరాబాద్‌లో జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తలపెట్టిన సత్యా గ్రహ దీక్షను విజయవంతం చేయాలని కోరారు.

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం