నేవీ రాడార్‌ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నేవీ రాడార్‌ పనుల పరిశీలన

Aug 23 2025 6:37 AM | Updated on Aug 23 2025 6:37 AM

నేవీ రాడార్‌ పనుల పరిశీలన

నేవీ రాడార్‌ పనుల పరిశీలన

పూడూర్‌: మండల పరిధిలోని దామగుండం అటవీ ప్రాంతంలో జరుగుతున్న నేవీ రాడార్‌స్టేషన్‌ పనులను శుక్రవారం భారత నౌకాదళ ఉపాధిపతి వైస్‌ అడ్మిరల్‌ తరుణ్‌ సోబ్తి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎస్పీకి ప్రశంసాపత్రం

అనంతగిరి: అంకితభావంతో విధులు నిర్వహించినందుకు గాను ఎస్పీ నారాయణరెడ్డికి భారత నౌకాదళం ప్రశంసాపత్రం అందజేసింది. శుక్రవా రం దామగుండంలో నౌకాదళ ఉప అధికారి, వైస్‌ అడ్మిరల్‌ తరుణ్‌ సోబ్తి ఎస్పీకి ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement