తాండూరు టౌన్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సీజనల్ వ్యాధులను నివారించవచ్చని మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు. డ్రైడేను పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. దోమల నివారణకు రసాయనాల పిచికారీ, బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు, మురు గు కాలువలను శుభ్రం చేయించారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. టైర్లు, కొబ్బరి బొండాలు, పూల కుండీలు తదితర వాటిలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ శా నిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన కమిషనర్
తాండూరు: తాండూరు మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న బి.యాదగిరి శుక్రవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీలో సమస్యలు లేకుండా చూడాలని, ప్రజలకు సత్వర సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.