
రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు
తాండూరు రూరల్: స్థానిక సంస్థలకు త్వరగా ఎన్ని కలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబరులో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలంలో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. బండపల్లి, సిద్దన్న మడుగు తండా, ఇందూర్ గ్రామాల్లో అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పాలన స్తంభించి పోయిందని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే సమస్యలు తొలగిపోతాయని పేర్కొన్నారు. పనుల జాతరలో కార్యక్రమంలో భాగంగా తాండూరు నియోజకవర్గానికి రూ.8 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మార్చి 31లోగా పనులు పూర్తి చేస్తామన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రోడ్లను బాగు చేయిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమన్నారు. నిజమైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తాండూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.6 కోట్లతో ఇందూరు – పెద్దేముల్ వరకు బీటీ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతులకు రూ.100 కోట్లు మంజూరైనట్లు పేర్కొ న్నారు. కొంత మంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వారి మార్పు రావాలని అన్నారు. తాండూరు మున్సిపాలిటలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను వెంటనే బదిలీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, తట్టెపల్లి సొసైటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ అంజయ్య, నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణ, సీడీపీఓ శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో వసతులు కల్పిస్తాం
యాలాల: గ్రామాల్లో వసతుల కల్పనే లక్ష్యంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జుంటుపల్లి, పగిడిపల్లి, ముకుందాపూర్ గ్రామాల్లో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో కొత్త పంచాయతీ భవనాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, మాజీ అధ్యక్షుడు బీమప్ప, బీ బ్లాక్ అధ్యక్షుడు అనిల్‌కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, ఏఎంసీ డైరెక్టర్ రాజు, నాయకులు హన్మంతు, అక్బర్‌బాబా, మహిపాల్, చంద్రశేఖర్‌గౌడ్, మల్లప్ప, విజయ్ పాల్గొన్నారు.