
సీసీకెమెరాల ఏర్పాటుతో నేరాల కట్టడి
షాద్‌నగర్: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను కట్టడి చేయొచ్చని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని రాయికల్‌లో కాంగ్రెస్ నేత రాయికల్ శ్రీనివాస్ తన సొంత నిధులు రూ.2లక్షలతో గ్రామంలో సీసీకెమెరాలను ఏర్పాటు చేయించారు. ఈ కెమెరాలను గురువారం ఏసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాలను నియంత్రించడంలో కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. రాయికల్ గ్రామం జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో రద్దీగా ఉంటుందని, గ్రామంలో భద్రతా చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో సీఐ విజయ్‌కుమార్, మాజీ సర్పంచ్ ఆశన్నగౌడ్, దిద్దుల కృష్ణయ్య, పాండు నాయక్, నాయకులు పాల్గొన్నారు.
ఏసీపీ లక్ష్మీనారాయణ