
హిందూ ఉత్సవ సమితి ఎన్నిక
తాండూరు టౌన్: తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు సమితి అధ్యక్షులు తాటికొండ స్వప్న, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సిములు 40 మందితో కూడిన కార్యవర్గాన్ని ప్రకటించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గౌరవాధ్యక్షులుగా రాజుగౌడ్, కోశాధికారిగా రొంపల్లి సంతోష్‌కుమార్ కొనసాగుతుండగా తాజాగా ఉపాధ్యక్షులు, సహా కార్యదర్శులు, అధికార ప్రతినిధి, కార్యనిర్వాహక కార్యదర్శులు, సాంస్కృతిక కార్యదర్శులు, సమన్వయ కమిటీ, ప్రచార కార్యదర్శులు, న్యాయ సలహాదారులు, ఆధ్యాత్మిక సలహాదారులను నియామకం చేశారు. అలాగే ముఖ్య సలహాదారులుగా పలువురు పట్టణ ప్రముఖులను నియమించారు. ఈ కార్యవర్గం 2025–26 సంవత్సరానికి గాను హిందూ సంప్రదాయ పండగల నిర్వహణ, ఉత్సవాల నిర్వహణకు తమ సేవలను అందిచనున్నట్లు సమితి అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.