
అస్తవ్యస్తంగా మల్కాపూర్
తాండూరు రూరల్: మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. ప్రత్యేకాధికారి ఇప్పటివరకు ఊరికి వచ్చిన దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, వీధి లైట్ల ఏర్పాటు ఇలా అన్ని అంశాల్లో పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు లేవని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీలో నిధుల కొరత ఉందని కార్యదర్శి ఇస్మాయిల్ తెలిపారని చెప్పారు. ఇకనైనా తమ గ్రామాన్ని పట్టించుకోవాలని అధికారులను వేడుకొంటున్నారు.
నిధులు లేక అభివృద్ధి పనుల నిలిపివేత

అస్తవ్యస్తంగా మల్కాపూర్