
ఆస్తి, ప్రాణ నష్టం జరగొద్దు: ఎస్పీ
అనంతగిరి: భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం నగరం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 72 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎక్కడ ఏం జరిగినా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. సహాయం కావాల్సిన వారు ఫోన్ నంబర్ 084162 35291 79950 61192లకు కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్తి, ప్రాణ నష్టం జరగొద్దు: ఎస్పీ