దుద్యాల్ తహసీల్‌కు అవార్డుల పంట
దుద్యాల్: తహసీల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అధికారులు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ తహసీల్దార్‌గా కిషన్, ఉత్తమ ఉప తహసీల్దార్‌గా వీరేశ్‌బాబు, ఉత్తమ ఆర్‌ఐగా నవీన్, ఉత్తమ సర్వేయర్‌గా మహేశ్‌కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో వారిని కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు.
ఉత్తమ కార్యదర్శులుగా భాస్కర్, రాజిరెడ్డి
కుల్కచర్ల: కుల్కచర్ల, చౌడపూర్ కార్యదర్శులు భాస్కర్, రాజిరెడ్డి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. భాస్కర్ కుల్కచర్ల ఇన్‌చార్జి ఎంపీఓగా భాధ్యతలు నిర్వహిస్తుండగా, రాజిరెడ్డి చౌడాపూర్ ఇన్‌చార్జి ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్నారు.
ఎంపీఓకు ఉత్తమ సేవా అవార్డు
యాలాల: మండల పంచాయతీ అధికారి గాలి యాదయ్య సోమవారం ఉత్తమ సేవా అధికారి అవార్డును అందుకున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో స్పీకర్ ప్రసాద్‌కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆయనకు ఈ అవార్డు అందజేశారు. బీసీ బాలికల హాస్టల్ సంక్షేమాధికారి భాగ్యలక్ష్మికి సైతం అవార్డును అందుకున్నారు.
నలుగురికి ఉత్తమ అవార్డులు
దుద్యాల్ తహసీల్‌కు అవార్డుల పంట
దుద్యాల్ తహసీల్‌కు అవార్డుల పంట
దుద్యాల్ తహసీల్‌కు అవార్డుల పంట


