రాజ్యాంగం మార్పునకు కుట్ర
పరిగి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం పట్టణ కేంద్రంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఎంతో శ్రమకూర్చి రచించిన రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనాలు దక్కుతున్నాయన్నారు. దేశంలోని పెద్ద కుబేరాల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తుందన్నారు. పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి ఐక్యంగా ఉన్న ప్రజలు రెచ్చగొట్టి విడగొడుతుందని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటు పడుతున్న కాంగ్రెస్‌కు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆయూబ్, ఆలయ కమిటీ చైర్మన్ పార్ధసారథి, డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతుముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు పాలాద్రి శ్రీను, బాదం శ్రీను, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
బడాబాబుల కోసమే బీజేపీ ప్రభుత్వం
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


