ఇఫ్తార్‌ విందులో స్పీకర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌ విందులో స్పీకర్‌

Mar 17 2025 9:31 AM | Updated on Mar 17 2025 9:31 AM

ఇఫ్తా

ఇఫ్తార్‌ విందులో స్పీకర్‌

అనంతగిరి: శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ వికారాబాద్‌ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్‌ హాలులో వ్యాపారవేత్త తన్వర్‌అలీ ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. రంజాన్‌ ఉపవాసాల సందర్భంగా స్పీకర్‌ ముస్లిం సోదరులకు ఖర్జురాలు తినిపించి దీక్షను విరమింపజేశారు. ప్రతి ఒక్కరూ ఆహ్లాద వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు.

26న వాహనాల వేలం

ఎస్పీ నారాయణరెడ్డి

అనంతగిరి: జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పేరుకుపోయిన 148 గుర్తు తెలియని వాహనాలను ఈ నెల 26న వేలం వేయనున్నట్లు ఆదివారం జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వికారాబాద్‌ జిల్లా పోలీస్‌ కేంద్రంలో భద్రపర్చిన ఈ వాహనాలను పోలీస్‌ చట్టం 1861లోని సెక్షన్‌ 26 ప్రకారం బహిరంగ వేలం వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఏదైన వాహనంపై ఎవరికై న అభ్యంతరం, యాజమాన్య హక్కులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం వాహనాల వేలం కమిటీ చైర్మన్‌, జిల్లా అదనపు ఎస్పీ టీవీ హన్మంత్‌రావును ఫోన్‌లో 87126 70012 సంప్రదించాలని వివరించారు.

రక్త మైసమ్మ సేవలో మండలి చీఫ్‌ విప్‌

తాండూరు రూరల్‌: పెద్దేముల్‌ మండలం మారెపల్లి గేటు వద్ద ఉన్న రక్త మైసమ్మ జాతరలో మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలో ఉన్న కేజీబీవీ పాఠశాల విద్యార్థినులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శాలువతో మహేందర్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తాం

తాండూరు రూరల్‌: మండల పరిధిలోని మల్కాపూర్‌ శివారులోని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ సమీపంలోని క్వారీలో ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అటవీశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ ఫిర్యానాయక్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల క్వారీలో చిరుతపులి పిల్ల సంచారిస్తోందన్న ప్రచారంపై ఆయన స్పందించారు. మల్కాపూర్‌తో పాటు సిమెంట్‌ ఫ్యాక్టరీలో కార్మికులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. చిరుతపులి పిల్ల కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బెల్కటూర్‌ సమీపంలో కూడా ఎలుగుబంటి సంచరిస్తోందన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

పీఏసీఎస్‌ చైర్మన్‌కుసేవా వైభవ రత్న అవార్డు

కొడంగల్‌: కొడంగల్‌ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌ కటుకం శివకుమార్‌ గుప్తాకు సేవా వైభవ రత్న అవార్డును ఆదివారం ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని సర్‌ సీవీ రామన్‌ అకాడమి(సేవా సాంస్కృతిక సంస్థ) రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం అవార్డును అందజేశారు. ఉగాది మహోత్సవ సువర్ణ ఘంటా కంకణ గోల్డ్‌ మెడల్స్‌ అవార్డుల సంబరాల సందర్భంగా హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో సేవా వైభవ రత్న అవార్డును సీవీ రామన్‌ అకాడమి అధ్యక్షుడు డా.విజయ్‌కుమార్‌, చాముండేశ్వర మహర్షి, వెంకటేశ్వర్‌రావు చేతుల మీదుగా అందుకున్నారు. శివకుమార్‌ గుప్తా ప్రస్తుతం పీఏసీఎస్‌ చైర్మన్‌గా, ఆర్యవైశ్య సంఘం వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. లయన్స్‌క్లబ్‌, బాధ్యత సేవా సంస్థల్లో ప్రతినిధిగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.

ఇఫ్తార్‌ విందులో స్పీకర్‌ 
1
1/3

ఇఫ్తార్‌ విందులో స్పీకర్‌

ఇఫ్తార్‌ విందులో స్పీకర్‌ 
2
2/3

ఇఫ్తార్‌ విందులో స్పీకర్‌

ఇఫ్తార్‌ విందులో స్పీకర్‌ 
3
3/3

ఇఫ్తార్‌ విందులో స్పీకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement