త్వరితగతిన పూర్తి చేయాలి
జిల్లా నేతలకు ఎన్నికల సమయంలోనే సాగునీటి ప్రాజెక్టులు గుర్తొస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా సాగు నీటి ప్రాజెక్టులపైన చర్చ జరుగుతూనే ఉంది. ఉత్తర తెలంగాణలో మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం వివక్షకు తావులేకుండా పనులు చేపట్టాలి. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పూర్తి చేసి జిల్లా రైతాంగానికి సాగునీరందించాలి. జిల్లా నేతలు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
– ఎం.నాగేశ్వర్, టీ జేఏసీ చైర్మన్, వికారాబాద్ జిల్లా


