తప్పుల తడక.. గందరగోళం | - | Sakshi
Sakshi News home page

తప్పుల తడక.. గందరగోళం

Jan 5 2026 11:35 AM | Updated on Jan 6 2026 1:24 PM

తప్పు

తప్పుల తడక.. గందరగోళం

సాగు భారమాయే! సాగు రైతుకు భారంగా మారుతుంది. పెట్టుబడి పెరగడం, మద్దతు ధరలు అంతంతే ఉండడంతో అప్పుల పాలవుతున్నారు. 8లోu 9లోu

తాండూరు ముసాయిదా జాబితా

సాగు భారమాయే! సాగు రైతుకు భారంగా మారుతుంది. పెట్టుబడి పెరగడం, మద్దతు ధరలు అంతంతే ఉండడంతో అప్పుల పాలవుతున్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ మున్సిపల్‌ ముసాయిదా ఓటరు జాబితాలు తప్పుల తడకగా ప్రచురించారు. ఒక వార్డులోని ఓట్లు మరొక వార్డులో చేర్చారు. దీంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు రూపకల్పన చేసి డిసెంబర్‌ 29న ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వార్డు ప్రత్యేకాధికారులు, బిల్‌ కలెక్టర్లు, మూడు రోజుల పాటు కసరత్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వికారాబాద్‌ మున్సిపల్‌లో 34 వార్డుల ఓటర్‌ లిస్టుల డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి శుక్రవారం ప్రదర్శించారు. ఈ లిస్టుల్లో ఒక వార్డులోని ఓటర్ల పేర్లు మరొక వార్డులో ఉన్నాయి. పలు వార్డుల్లో గతంలో ఉన్నవారి కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో ఓటర్లు, ఆశావాహులు ఓటర్‌లిస్టులను క్షుణ్ణంగా పరిశీలించుకుని మున్సిపల్‌ కార్యాలయంలో అభ్యంతరాలు ఇస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని లోటుపాట్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ఓటర్లు కోరుతున్నారు.

మచ్చుకు కొన్ని

● పట్టణంలోని రామయ్యగూడ ఎంఐజీ కాలనీ వార్డులో అంబేడ్కర్‌ నగర్‌ వాసుల ఓట్లు చేరాయి.

● శివరాంనగర్‌ కాలనీ వార్డులోకి అఫ్సర్‌జంగ్‌బాగ్‌, ఇతర కాలనీల ఓట్లను చేర్చారు.

● గాంధీ కాలని వార్డులో సుభాష్‌నగర్‌, కొత్తగంజ్‌ ఓటర్లను చేర్చారు.

● 10వ వార్డు అనంతగిరిపల్లిలో గతంలో 1,441 ఓట్లు ఉండగా, కొన్ని ఓట్లు వేరే వార్డులో చేర్చడంతో 1,370కి తగ్గింది.

జాబితాలో మరణించిన వారి పేర్లు

తాండూరు: మున్సిపల్‌ అధికారుల నిర్లక్షం ఓటర్ల మనోభావాలను దెబ్బతీస్తోంది. వార్డుల వారీగా ప్రకటించిన ఓటరు జాబితాలో మున్సిపాలిటీలకు సంభందం లేని వ్యక్తుల పేర్లు జాబితాలో చేర్చడం.. ఐదారేళ్ల క్రితం మరణించిన వారి పేర్లు సైతం లిస్టులోఉండడంతో విమర్శలు వస్తున్నాయి. ఓటరు జాబితాలో అచ్చు తప్పులు, ఫొటోలతో సహ ప్రదర్శించకపోవడం, కంటికి కనిపించకుండా చిన్న అక్షరాలతో జాబితా ప్రదర్శించడంతో రాజకీయ నాయకులతో పాటు ఓటర్లను సైతం ఆందోళనకు గురి చేస్తోంది.

కొత్తగా 13,774 ఓటర్లు

తాండూరు మున్సిపాలిటీకి 2020 జనవరిలో నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికలలో 36 వార్డులకు గాను మొత్తం 63,336 మంది ఓటర్లు ఉన్నారు. ఆరేళ్ల తర్వాత మున్సిపల్‌ ఎన్నికల కోసం ఈ నెల 1వ తేదీన మున్సిపల్‌ అధికారులు ఓటరు జాబితా ముసాయిదాను ప్రదర్శించారు. ఓటరు జాబితాలో మొత్తం 77,110 ఓటర్లుఉన్నారు. కాగా కొత్తగా 13,774 మంది ఓటర్లు పెరగాయి. దీంతో ఇక్కడ భారీగా నకిలీ ఓట్లు నమోదు చేశారంటూ రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇష్టారాజ్యంగా ముసాయిదా ఓటర్‌ జాబితా

ఓటరు లిస్టులపై అభ్యంతరాలు

పలువార్డుల్లో వందకు పైగా ఇతర వార్డుల్లోని ఓటర్లు

2020 2026

పురుషులు 31,268 37,547

మహిళలు 32,067 39,558

ఇతరులు 01 05

మొత్తం 63,336 77,110

తప్పుల తడక.. గందరగోళం 1
1/1

తప్పుల తడక.. గందరగోళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement