నేటి నుంచి సైన్స్ ఫెయిర్
అనంతగిరి: పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ (నంబర్–1)లో సోమ, మంగళవారం జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శన ఉంటుందని జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రధాన అంశం ఆత్మనిర్బర్–వికసిత్ భారత్ సాధనకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితంలో థీమ్‌లు రూపొందించాలన్నారు. వీటిలో ఉప అంశాలుగా సుస్థిర వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాలు, పునరుత్పాదక శక్తి, హరిత శక్తి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వినోద భరితమైన గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ–నిర్వహణ ఉంటుందన్నారు. ఇందుకు అఽధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
బొంరాస్‌పేట: తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం (టీఆర్‌జేకేఎస్) రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఈనెల 6న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ఆసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు ఆయా జిల్లాలోని జానపద కళాకారుల సంఘం మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ఈ సమావేశం ఉంటుందన్నారు. కళాకారుల సంక్షేమనిధి, ఆర్థిక భరోసా, భద్రత గుర్తింపు కార్డు అందజేత, పలువురికి సన్మానం తదితర అంశాలపై చర్చింనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఆసంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రమణకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచు లింగయ్య, మహిళా విభాగం నాయకులు కవిత, సునీత, శ్రీదేవి తదితరులు హాజరవుతారని చెప్పారు.
దుద్యాల్: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, బీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు లగచర్ల సురేశ్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను నరేందర్‌రెడ్డి పట్టించుకోవడంలేదని, రైతులకోసం కొట్లాడిన తనకు సరైన గుర్తింపు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తన పదవికి, బీఆర్‌ఎస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు.
టీయూడబ్ల్యూజే–143 ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రశేఖర్
దౌల్తాబాద్: నియోజకవర్గ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నియోజకవర్గ టీయూడబ్ల్యూజే–143 ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికే జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హమీ ఇచ్చిందని.. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి హామీ నెరవేర్చాలని కోరుతామన్నారు. అక్రిడేషన్, హెల్త్‌కార్డుల సమస్యలు సైతం పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ ప్రహ్లాద్, గౌరవ అధ్యక్షుడు మల్కయ్యగౌడ్, ప్రధానకార్యదర్శి నరసింహ, కోశాధికారి అశోక్, ఉపాధ్యక్షుడు అక్రంపాష, అనంతయ్య, టీఈఎంజేయూ అధ్యక్షుడు హన్మంత్, ప్రధానకార్యదర్శి గోకుల్ తదితరులున్నారు.
కొందుర్గ: వేదగిరి వేదపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి మార్చి 2 వరకు నిర్వహించనున్న సనాతన వేదయజ్ఞ మహా పాదయాత్ర జిల్లేడ్ చౌదరిగూడ మండలం తూంపల్లిలోని వేదగిరిగుట్టపై ప్రారంభమవుతుందని వేదగిరి సంస్థాపకుడు మర్రి కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామానుజ చినజీయర్‌స్వామి హాజరై యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. రథయాత్ర నేరుగా రామేశ్వరం చేరుకుని అక్కడి నుంచి శ్రీనగర్ వరకు 16 రాష్ట్రాల మీదుగా 54 రోజుల పాటు 9,500 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని వివరించారు.
నేటి నుంచి సైన్స్ ఫెయిర్


