తిరుపతి అర్బన్:ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం తిరుపతికి వస్తున్నారని.. ఆయన పర్యటనకు పటిష్ట భద్రత కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ జయకృష్ణతో కలసి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గురువారం ఉద యం 10 గంటలకు తిరుపలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి చేరుకుంటారని చెప్పారు. 10.45 గంటలకు తిరుమల గాయత్రి గెస్ట్‌హౌస్ వెళతార ని తెలిపారు. 11.10 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుని మధ్యాహ్నం 12.45 గంటలకు తిరుమ ల నుంచి బయల్దేరి తిరుపతి అగ్రికల్చర్ యూనివర్సిటీకి వస్తారన్నారు. అనంతరం 1.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా భద్రాద్రి కొత్తగూడానికి బయలుదేరుతారనపి వివరించారు. ఈ క్రమంలో హెలీప్యాడ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఆర్‌డీఓ రామ్మోహన్, అడిషనల్ ఎస్పీలు రామకృష్ణ, శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, అర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజా నాయక్, జిల్లా రవాణా అధికారి మురళీమోహన్ పాల్గొన్నారు.


