రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ దాడి | - | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ దాడి

Nov 24 2026 1:42 AM | Updated on Nov 24 2026 1:42 AM

● మాటల్లో సనాతన ధర్మం ● చేతల్లో పురాతన ఆలయాలు విధ్వంసం – 8లో

సూళ్లూరుపేటలోని రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

చారిత్రక స్వయంభు అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత

మూల విరాట్‌ విగ్రహానికి సుత్తి, గడ్డపార పోట్లు

●

మంగళవారం శ్రీ 24 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

‘సనాతన ధర్మమంటే పురాతన ఆలయాలు కూల్చడమేనా..?. స్వయంభుగా వెలసిన విగ్రహాలను ధ్వంసం చేయడమేనా..?. నిత్యపూజలందుకునే మూలవిరాట్‌ను గుణపాలతో పెకళించడమేనా..?. దైవచింతన పెంచే అభయాంజనేయ స్వామి ఆలయాన్ని హిటాచీతో ధ్వంసం చేయడమేనా..?. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఆలయ ఆనవాళ్లు లేకుండా చేయడమేనా..? ఇదేం న్యాయం.. ఇదేం ధర్మం..?.. ఇదేం పాలన..?’ అంటూ రేణిగుంట మండల వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయపురంలో చారిత్రక స్వయంభు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని రోడ్డు పనుల పేరుతో కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి విధ్వంసాలు కూటమి నేతలకే చెల్లునని శాపనార్థాలు పెట్టారు.

మూలవిరాట్‌కు..

గునపం పోటు!

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: రేణిగుంట మండలం, ఆంజనేయపురంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగి స్వయంబు అభయాంజనేయ స్వామి ఆలయం సోమవారం కూల్చివేతకు గురైంది. రామ భక్తులు, సమీప గ్రామస్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సనాతన ధర్మ పరిరక్షణ అంటే పురాతన ఆలయాలను కూల్చేయడమేనా?.. స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేయడమేనా?.. అని ప్రశ్నిస్తున్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలోని స్వామివారి విగ్రహాలను వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా తరలించాల్సింది పోయి, కూలీల చేత సుత్తులు, కొడవళ్లతో తొలగించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన పలు చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలను ప్రస్తావించారు.

పవిత్ర క్షేత్రం.. అపవిత్రం

అగస్త్య మహాముని, ఆయన సతీమణి లోపాముద్ర చేత అభిషేకం అందుకున్న పవిత్ర విగ్రహంగా ఈ స్వామివారు ప్రసిద్ధి చెందారని స్థానికులు చెబుతున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామి ఈ ప్రాంతంలో స్వయంభుగా వెలిశారని గుర్తుచేశారు. సుమారు 1,400 సంవత్సరాల క్రితం పల్లవ రాజుల కాలంలో ఇక్కడ రాతి మండపాన్ని నిర్మించారని, ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని గుర్తించిన పల్లవ రాజులు ఇక్కడ విశాలమైన కోనేరును కూడా తవ్వించారని పేర్కొన్నారు. అన్నమయ్య కీర్తించిన క్షేత్రంగా, కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి పూజలందుకున్న పవిత్ర ప్రాంతంగా దీని విశిష్టతను వివరించారు. బ్రిటిష్‌ పాలకులు సైతం సుమారు 150 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతానికి ఆంజనేయపురం పేరుతో రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇంతటి ఘనమైన చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన ఆలయాన్ని కూటమి ప్రభుత్వ హయాంలో కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

సుత్తి, గడ్డపార్లతో పెకలించడం అపచారం

వేదవేదాంగ పండితుల సమక్షంలో, పవిత్ర వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా తరలించాల్సిన మూలవిరాట్టును కూలీల చేత సుత్తులు, కొడవళ్లతో పెకలించడం ఎంతటి అపచారం. ఆలయం వెలుపల ఉన్న ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని హిటాచీ యంత్రంతో కూల్చివేసి ధ్వంసం చేయడం దారుణం. ఆలయ కూల్చివేత పనుల్లో పాల్గొంటున్న ఒక బ్రాహ్మణ కార్మికుడు సైతం ఇంతటి పురాతన ఆలయాన్ని కూల్చివేయడం మహాపాపమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ పెద్దలు స్పందించాలి

– భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement