తీర్ధయాత్రల్లో భాగంగా తిరుపతికి విచ్చేస్తున్న క్రమంలో మార్గంలోని హనుమాన్ ఆలయం కూలివేస్తున్న దృశ్యాలు బాధించాయి. ఇవి చూసిన ఇక్కడ ఆగి పరిస్థితిని తెలుసుకున్నాను. ఇదే పరిస్థితి మా రాష్ట్రంలో వస్తే ఎవరినీ వదలిపెట్టం. అలాంటి వారికి మరణదండన తప్పదు. ఏపీలో సనాతన ధర్మం మంటకలసింది. దీన్ని హిందువులు ఖండించాల్సిన అవససరం ఉంది.
– మనోజ్‌గిరి మహారాజ్, హరిద్వార్, ఉత్తరాఖాండ్
మనోభావాలు దెబ్బతీయడమే
స్వయంబుగా వెలసిన అభయాంజనేయస్వామి ఆలయం కూల్చివేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే. ఈ మార్గంలో తిరుమల శ్రీవారి భక్తులు రాకపోకలు సాగించేవారికి ఈ ఆలయ పరిసరాలు సేద తీర్చతీర్చడంతో ఆధ్మాత్మిక అనుభూతి పొందుతున్నారు. నేను కూడా స్వామి వారిని దర్శించుకుని వెళుతుంటాను. నేడు ఈ గుడి కూల్చివేతకు గురికావడం బాధగా ఉంది. – బత్యాల మల్లికార్జున, భక్తుడు, రైల్వేకోడూరు
బాధనిపిస్తోంది
మాది హైదరాబాద్. మా అత్తవాళ్లు కోడూరుతో ఉంటారు. తరచూ నేను తిరుమలకు వస్తుంటాను. కోడూరుకు రాకపోకలు సాగించేటప్పుడు ఆంజనేయస్వామిని దర్శించుకుంటాను. ఈ రోజు ఇక్కడి పరిస్థితి చూశాక చాలా బాధగా ఉంది. దీనిపై హిందూ సమాజం, పెద్దలు స్పందించాలి. పురాతన ఆలయాలను ఇలా ధ్వంసం చేయడం అనేది సనాతన ధర్మానికి విరుద్ధం. – గిరిజా, భక్తురాలు


