అప్పీళ్లలోనూ తీరని అన్యాయం | - | Sakshi
Sakshi News home page

అప్పీళ్లలోనూ తీరని అన్యాయం

Nov 24 2026 1:42 AM | Updated on Nov 24 2026 1:42 AM

ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా

అభ్యర్థుల నిరీక్షణ

తిరుపతి రూరల్‌ అభ్యర్థులను లోనికి అనుమతించని పోలీసులపై చెవిరెడ్డి ఆగ్రహం

అర్ధరాత్రి వరకు కొనసాగిన విచారణలు

తిరుపతి రూరల్‌: చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల తిరస్కరణ వ్యవహారంలో అభ్యర్థులకు కష్టాలు వీడడం లేదు. నామినేషన్ల పరిశీలనలో అన్యాయం జరిగిందంటూ అప్పీళ్లు చేసుకున్న అభ్యర్థులకు విచారణ సమయంలోనూ నిరీక్షణ తప్పడం లేదు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం మండలాల వారీగా అప్పీళ్లపై విచారణ చేపడుతుండగా.. ఉదయం 9 నుంచి అర్ధరాత్రి వరకు అభ్యర్థులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుపతి రూరల్‌ మండలానికి చెందిన అభ్యర్థులను ఆర్డీఓ కార్యాలయంలోకరి పోలీసులు అనుమతించకుండా అడ్డుకోవడంపై అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పీళ్ల విచారణకు వచ్చిన అభ్యర్థులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన అభ్యర్థులకు కనీస అవకాశం కూడా కల్పించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

కనీస సౌకర్యాలూ కరువే

అప్పీళ్ల విచారణకు వచ్చిన అభ్యర్థులకు ఆర్డీఓ కార్యాలయంలో కనీస సౌకర్యాలు లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కూర్చోవడానికి కుర్చీలు, కనీసం తాగేందుకు మంచి నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వాదనలు విని.. నిర్ణయం చెప్పకుండా..

అప్పీళ్లకు వచ్చిన అభ్యర్థులు, వారి తరఫున వచ్చిన న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నా.. ఆర్డీఓ వాటిని విని స్పష్టమైన నిర్ణయం వెల్లడించకుండా పంపిస్తున్నారనే విమర్శలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతోంది.

మండలాల వారీగా

అప్పీళ్లపై విచారణ

అభ్యర్థులకు చెవిరెడ్డి కుటుంబం అండ

న్యాయం కోసం అప్పీళ్లను ఆశ్రయించిన అభ్యర్థులకు చెవిరెడ్డి కుటుంబం అండగా నిలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డితో పాటు, తిరుపతి రూరల్‌ జెడ్పీటీసీ చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డి నామినేషన్ల తిరస్కరణలో జరిగిన పరిణామాలపై అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తూ న్యాయపోరాటానికి సహకరించారు. అప్పీళ్లలోనూ తమకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని బాధిత అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement