తిరుపతి అర్బన్: మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 1,82,00 మంది ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణి చేసినట్టు డీపీవో సుశీలాదేవి సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మిగిలిన ఓటర్ స్లిప్పులను మంగళ, బుధవారాల్లో పూర్తి చేస్తారని తెలిపారు. మరోవైపు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మామిడికి బీమా తప్పనిసరి
తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు పంటకు నష్టం జరిగితే పరిహారం పొందడానికి 2026–27 సంవత్సరానికి సంబంధించి ప్రీమియం కట్టుకోవాలని ఉద్యానశాఖ జిల్లా అధికారి జయభరత్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎకరం పంటకు రైతులు రూ.1,750 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువు ఉందని పేర్కొన్నారు. రైతులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్, బ్యాంకులు, అధీకృత బీమా ప్రతినిధుల, పీఎంఎఫ్‌పీవై యాప్ ద్వారా పంట బీమా నమోదు చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు.
సంజీవనిపై శిక్షణ
తిరుపతి తుడా: డిజిటల్ ప్రజారోగ్య సేవల కార్యక్రమం సంజీవని అమలులో భాగంగా తిరుపతి జిల్లాలో వైద్యాధికారులు, సంజీవని మిత్రాలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సోమ వారం తిరుపతి రూరల్ మండలంలోని గొల్లపల్లి సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వి.బాలకృష్ణనాయక్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమాన్ని మొత్తం ఏడు బ్యాచ్‌లుగా విభజించి, ప్రతి బ్యాచ్‌కు రెండు రోజుల పాటు శిక్షణ అందించేలా కార్యాచరణ రూపొందించినట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 8 వరకు శిక్షణ కొనసాగనుందని తెలిపారు. డీపీఎంఓ డాక్టర్ ఎన్.తులసీదాస్ పాల్గొన్నారు.


