వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ నేతల దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ నేతల దాడి

Nov 24 2026 1:42 AM | Updated on Nov 24 2026 1:42 AM

చిట్టమూరు: మండల పరిధిలోని ఎల్లూరు పంచాయతీలో వైఎస్సార్‌సీపీ వర్గీయులపై అధికార పార్టీ నాయకులు సోమవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్లూరు పంచాయతీలోని గొల్లనట్టు గ్రామానికి చెందిన యాటగిరి పోలమ్మ అనే గిరిజన మహిళ వైఎస్సార్‌సీపీ మద్దతుతో వార్డు సభ్యురాలిగా నామినేషన్‌ వేశారు. పంచాయతీలోని టీడీపీ నాయకులు సోమవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని బెదిరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైఎస్సార్‌సీపీ వర్గీయులు అడ్డుకోగా వారిపై కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో కమతం కిష్టయ్య, ఇలప వెంకటేష్‌, ఇలప సతీష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108లో వైద్యశాలకు తరలించారు. దాడికి పాల్పడ్డవారు. తాము వచ్చిన కారును అక్కడే వదిలేసి పరారయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement