తిరుపతి రూరల్:తలకోన సెంట్రల్ బీట్ పరిధిలో బుధవారం అటవీశాఖ అధికారు లు నిర్వహించిన కూంబింగ్ లో ఒక స్మగ్లర్‌ను అరెస్ట్ చేసి, 157 కిలోల ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చైతన్య, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వై.రాజేష్‌కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎరచ్రందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లు కనిపించారు. అటవీ శాఖ సిబ్బందిని గమనించిన స్మగ్లర్లు దుంగలను కింద పడేసి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా పాలపరంబట్టు గ్రామానికి చెందిన సెట్టు చిన్నస్వామిని అధికారులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి రూ.7లక్షల విలువైన నాలుగు ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.


