ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని నిరుపేద విద్యార్థుల విషయంలో చంద్రబాబు సర్కారు వైఖరి సరికాదు. విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతున్నారు. ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, నవంబర్ సగం గడిచినా ఇప్పటివరకు రికార్డులు ఇవ్వకపోవడం దారుణం. కార్పొరేట్ కళాశాలల్లో ఇప్పటికే ల్యాబ్ ప్రయోగాలు, రికార్డులు పూర్తి అయ్యాయి. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మాత్రం ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి
●


