దళిత మహిళపై టీడీపీ నేత దాడి | - | Sakshi
Sakshi News home page

దళిత మహిళపై టీడీపీ నేత దాడి

Nov 19 2026 12:31 PM | Updated on Nov 19 2026 12:31 PM

● పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ● పరామర్శకు వెళ్లిన మోహిత్‌రెడ్డిని అడ్డుకున్న ఖాకీలు

తిరుపతి రూరల్‌: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్న ఓ దళిత మహిళపై టీడీపీ గూండాలు విరుచుకుపడ్డారు. చంద్రగిరి మండలం ఐతేపల్లెకి చెందిన దళిత మహిళ శిరీష బుధవారం నామినేషన్‌న్‌ దాఖలు చేసేందుకు వెళ్లగా అదే పంచాయతీకి చెందిన టీడీపీ నేత ఏవీ రమణమూర్తి, ఆయన అనుచరులు అడ్డుకుని దాడికి తెగబడ్డారు. భయంతో వెళ్లిపోగా ఇంటికి వెళ్లి నామినేషన్‌ వేస్తే చంపేస్తామని బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించారు. స్థానిక ముస్లిం యువకుడు అంజాద్‌ దీనిపై చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి సమాచారం అందించి, బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఈ క్రమంలో నామినేషన్‌ వేసేందుకు రక్షణ కల్పించాలని దళిత మహిళ శిరీష పోలీసులను ఆశ్రయించారు. కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి శిరీష వెళ్లగానే ఆమె ఇంటిని టీడీపీ నేత ఏవీ రమణ మూర్తి, అనుచరులు ధ్వంసం చేశారు. దళిత మహిళకు అండగా నిలబడిన మైనారిటీ యువకుడు అంజాద్‌బాషాపై దాడి చేశారు

అదనపు ఎస్పీకి ఫిర్యాదు

నామినేషన్‌ వేయడానికి వెళితే తనపై దాడిచేసి తన ఇంటిని ధ్వంసం చేసిన టీడీపీ నేత ఏవీ రమణమూర్తిపై కేసు నమోదు చేయాలని కోరుతూ శిరీష కోరారు. ఈ మేరకు అదనపు ఎస్పీ రవిమనోహరాచారికి ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని, బాధ్యులపై కేసు నమోదు చేస్తామని అదనపు ఎస్పీ రవిమనోహరాచారి హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎస్పీ సుబ్బ రాయుడుకు కూడా బాధితురాలు విన్నవించారు.

మోహిత్‌రెడ్డి పరామర్శ

దాడికి గురైన దళిత, మైనారిటీ కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వెళ్లగా పోలీసులు చంద్రగిరి రాయల వారి కోట వద్ద అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించేందుకు వెళ్లిన నాయకుడిని అడ్డుకోవడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మోహిత్‌రెడ్డిని మాత్రం బాధితుల ఇళ్లకు అనుమతించారు. దాడికి పాల్పడిన వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement