స్కాలర్‌షిప్‌ల విడుదలకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్‌ల విడుదలకు డిమాండ్‌

Nov 19 2026 12:31 PM | Updated on Nov 19 2026 12:31 PM

తిరుపతి సిటీ : ఎస్వీయూ ఫార్మసీ కళాశాలలో రెండో సంవత్సరం విద్యార్థులకు వెంటనే స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్‌ చేశారు. బుధవారం ఈ మేరకు ప్రిన్సిపల్‌ దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ వర్సిటీ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే అనేకమంది విద్యార్థులు ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకడమిక్‌ క్యాలెండర్‌ రూపకల్పన, అమలులో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని విమర్శించారు. దాదాపు 20 మంది విద్యార్థులకు రెండు నెలల పాటు జీరో అటెండెన్స్‌ నమోదు చేయడంతో స్కాలర్‌షిప్‌లు నిలిచిపోయాయని మండిపడ్డారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు సంబంధిత విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని, సర్టిఫికెట్లను మాత్రం జారీ చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. లేకుంటే విద్యార్థులతో కలిసి కళాశాల ఎదుట నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు అనిత, నేతలు తిప్పేస్వామి, చరణ్‌, వర్షిత, లావణ్య పాల్గొన్నారు.

వ్యభిచార నిర్వాహకుల అరెస్ట్‌

శ్రీకాళహస్తి: పట్టణంలోని ప్రైవేట్‌ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో బుధవారం వన్‌ టౌన్‌ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తిరుపతికి చెందిన ఇద్దరు మహిళలు లాడ్జిలో బస చేయగా నిందితులు వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకుని వ్యభిచారంలోకి దింపారని తెలిపారు. ఈ కేసు వ్యవహారంలో కుట్ర కోణం ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

నెన్నూరులో టీడీపీకి భారీ షాక్‌

– పార్టీకి రాజీనామా చేసిన మాజీ వైస్‌ ఎంపీపీ

రామచంద్రాపురం : మండలంలోని నెన్నూరు పంచాయతీలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. గత 20ఏళ్లుగా టీడీపీ జెండా మోసిన మాజీ వైస్‌ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి బుధవారం ఆ పార్టీ కి రాజీనామా చేశా రు. ఆ మేరకు తన రాజీనామా లేఖను ఎమ్మెల్యే పులివర్తి నాని, పార్టీ మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డికి పంపించారు. ఏళ్ల తరబడి పనిచేసిన పార్టీలో అగౌరవ పడాల్సి వచ్చినందుకే రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. తన అనుచరులతో కలసి భవిష్యత్‌ రాజకీయాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement