దోచుకున్న డబ్బుతో | - | Sakshi
Sakshi News home page

దోచుకున్న డబ్బుతో

Nov 16 2026 2:44 AM | Updated on Nov 16 2026 2:44 AM

● శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్వర్ణముఖి నది నుంచి ఇసుకను అక్రమంగా చైన్నెకి తరలించి భారీగా డబ్బు ఆర్జించిన ఒక టీడీపీ నాయకుడు పంచాయతీ ఎన్నికల్లో రూ.50 లక్షలైనా ఖర్చుచేసి సర్పంచ్‌ సీటు దక్కించుకుంటానని తన అనుచరుల వద్ద శపథం చేస్తున్నాడట. ఇతర అభ్యర్థులు ఎవరైనా పోటీకి వస్తే పోలీసుల అండతో ఇబ్బందులు కలిగిస్తానని, పోటీకి ఎవరూ రావద్దొంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నాడట. ● రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలో ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున కబ్జా చేసిన ఓ ఘనుడు పంచాయతీ ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యాడు. సుమారు పాతిక ఎకరాల ప్రభుత్వ భూమిని చెరబట్టిన సదరు నేత ఎంత ఖర్చు అయినా సరే సర్పంచ్‌గా గెలివాలంటున్నాడట. గెలిస్తే అదే పంచాయతీ పరిధిలో ఉన్న మిగిలిన ప్రభుత్వ భూములను తన బినామీల పేరుతో స్వాహా చేయాలన్నదే అతని వ్యూహమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ● చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో కొండలను మాయం చేసి మట్టిని అమ్ముకున్న సొమ్ముతో పంచాయతీ పోరులో నిలిచేందుకు తెలుగు తమ్ముళ్లు కాలుదువుతున్నారు. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల నామినేషన్లు వేయనివ్వకుండా సహకరించేందుకు పోలీ సు, ఎన్నికల అధికారులకు భారీ మొత్తంలో ఆశ చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కూటమి ప్రభుత్వంలో మట్టి, ఇసుక అక్రమ రవాణాతో సంపాదన

సర్పంచ్‌ పదవికి రూ.కోట్లు

కుమ్మరించేందుకు సిద్ధం

ఏకగ్రీవాల కోసం భారీ నజరానాలు ఇస్తామంటూ హామీలు

నామినేషన్లకు ముందే జోరుగా ఖర్చు

బెంబేలెత్తిపోతున్న స్థానిక రాజకీయ నాయకులు

సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుక, మట్టి అక్రమ రవాణాతో రూ.కోట్లు దోచుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి కూడబెట్టిన అక్రమార్జనను కుమ్మరించి పంచాయతీ పీఠాలను కై వసం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. ప్రజాసేవ ముసుగులో పదవుల వేటకు తెరలేపి ఓటర్లను ప్రలో భ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రజల మద్దతు, అభి మానం కంటే డబ్బుసంచులే గెలుపు గుర్రాలుగా భావి స్తున్నారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టి సంపాదించిన డబ్బుతో ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతూ అధికార దర్పంతో మరింత రెచ్చిపోవాలని ప్రణాళిక లు సిద్ధం చేసుకుంటున్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థు లు నామినేషన్లు వేస్తే ఓడిపోతామన్న భయంతో పోలీసులు, ఎన్నికల అధికారులను అడ్డుపెట్టుకొని పోటీ లేకుండా గెలవాలని కుట్రలకు తెరలేపుతున్నారు.

సర్పంచ్‌ పదవికి రూ.కోట్లు

గ్రామాభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా సర్పంచ్‌ పదవి కోసం గతంలో పోటీ పడేవారు. తాము గెలిస్తే గ్రామానికి ఉన్న ఏయే సమస్యలు తీరుస్తామని, అభివృద్ధి పనులు చేపడతామని హామీలు ఇచ్చేవారు. అక్రమ మైనింగ్‌ ద్వారా రూ.కోట్లు ఆర్జించిన అధికార పార్టీ నేతలు అవన్ని మాకేం తెలియదు ఏకగ్రీవం చేయండి ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పుకొస్తున్నారు. పదవి దక్కితే ఆ తర్వాత సంపాదించుకోవచ్చనే ధీమాతో రూ.లక్షలు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. గ్రామస్థాయి పదవులకే ఈ స్థాయిలో డబ్బులు కుమ్మరించడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయంతో ఏకగ్రీవాలకు సహకరిస్తే భారీ మొత్తంలో గ్రామ అభివృద్ధికి వెచ్చిస్తామంటూ హామీలిస్తున్నారు. పుల్లంపేట, రైల్వేకోడూరు లాంటి పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానానికి రూ.కోటి నుంచి రూ.3 కోట్ల దాకా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మైనింగ్‌, పట్టణ పరిసర ప్రాంతాల పంచాయతీలకు ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

విమానం టికెట్లు వేసి మరీ..

రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఓబులవారిపల్లి, పుల్లంపేట, కోడూరు మండలాలకు చెందిన అనేక మంది ఉపాధి కోసం కువైట్‌ లాంటి అరబ్‌ దేశాలకు వలస వెళ్లారు. పంచాయతీ ఎన్నికల్లో కనీసం 50 మంది ఓటర్లు ప్రభావితం చేయగలిగిన వ్యక్తి అరబ్‌ దేశాల్లో ఉంటే వారిని రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు రూ.60 వేల వరకు ఖర్చు చేసి విమాన టికెట్లు పంపించి వారిని రప్పించి ఎన్నికల్లో మద్దతుగా తిప్పుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

నామినేషన్లకు ముందే పందేరాలు

పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత నామినేషన్ల పర్వం ఆదివారం ప్రారంభం కాగా తుది విడత 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇంకా నామినేషన్ల ప్రక్రియ పూర్థిస్థాయిలో ఊపందుకోకముందే ఎన్నికల ఖర్చుల హడావుడి మొదలైంది. సర్పంచ్‌ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న కొందరు ఇప్పటికే కులాలు, ప్రాంతాలు, వర్గాల వారిగా మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తామే రేసులో ఉన్నామని చెప్పుకోవడానికి మందు, విందులతో తమ పేరును ప్రాచుర్యంలోకి తెచ్చుకుంటున్నారు. నామినేషన్‌, పోలింగ్‌ నాటికి ఈ ఖర్చులు భారీ స్థాయిలో ఉంటాయని సమాచారం.

బెంబేలెత్తిపోతున్న ఇతర అభ్యర్థులు

డబ్బుతో ఎన్నికల బరిలో ఆధిపత్యం చెలాయిస్తున్న అధికార పార్టీ అక్రమార్కులను చూసి నిజాయితీగా పోటీ చేయాలనకునే సామాన్య అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రజల్లో మంచి పేరు, సేవా కార్యక్రమాలపై నమ్మకం ఉన్నప్పటికీ రూ.కోట్లు ఖర్చు చేసే ఆర్థిక స్తోమత లేక వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు రూ.కోట్లు ఖర్చు పెట్టడం తమవల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయాలు చేస్తున్న తాము ఇసుక, మట్టి వంటి అక్రమ రవాణాతో సంపాదించిన వారితో ఖర్చులో పోటీ పడలేమని నిట్టూరిస్తున్నారు. ఇలా అయితే తాము గ్రామాల్లోనే ఉంటూ ప్రజలకు సేవ చేయాలన్న కోరిక తీరదని తేల్చిచెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement