కలెక్టరేట్‌లో నామినేషన్‌ కౌంటర్‌ ఎక్కడ సారూ..? | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో నామినేషన్‌ కౌంటర్‌ ఎక్కడ సారూ..?

Nov 16 2026 2:44 AM | Updated on Nov 16 2026 2:44 AM

తిరుపతి అర్బన్‌ : ఎక్కడైనా అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఎవరైనా అడ్డుకుంటే జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో నామినేషన్‌ కౌంటర్‌ ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనీల్‌చంద్ర పునేఠా శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఆదివారం శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. నామినేషన్‌ పత్రాలను చించేసి గాల్లోకి ఎగరేసి కేరింతలు కొట్టారు. ఈ విషయం తెలిసినా అధికారులు కలెక్టరేట్‌లో నామినేషన్లు వేయడానికి వీలుగా ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో శ్రీకాళహస్తికి చెందిన పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో 44 డివిజన్లకు సంబందించి పలుచోట్ల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయడాన్ని అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డుకున్నారు. అంతేకాకుండా దాడులకు తెగపడ్డారు. దీంతో వారంతా నామినేషన్లు వేయలేక దిక్కులు చూడాల్సిన దుస్థితులు నెలకొన్నాయి.

సర్పంచ్‌ అభ్యర్థికి

రక్షణ కల్పించాలని వినతి

– ఎన్నికల కమిషన్‌, ఎస్పీకి న్యాయవాది లేఖ

తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్‌) : తొట్టంబేడు మండలం కొత్తకండ్రిగ గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి పి.రామచంద్రారెడ్డికి పోలీసు రక్షణ కల్పించాలని క్రిమినల్‌ డిఫెన్స్‌ అడ్వకేట్‌ సాయిరామ్‌ విప్పరపల్లి కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, తిరుపతి జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. రామచంద్రారెడ్డి వార్డు సభ్యులతో కలిసి పెద్దకన్నలి స్వర్ణ పంచాయతీ కేంద్రంలో నామినేషన్‌ వేసేందుకు వెళుతుండగా 50 మందికి పైగా వ్యక్తులు దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ క్రమంలో భయం లేకుండా స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తక్షణమే పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement