పోస్టుల్లేని డీఎస్సీ ఎందుకో? | - | Sakshi
Sakshi News home page

పోస్టుల్లేని డీఎస్సీ ఎందుకో?

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

● డీఎస్సీ నోటిఫికేషన్‌పై పెదవి విరుస్తున్న నిరుద్యోగులు ● ఇదంతా భూటకమేనంటూ విమర్శలు ● పోస్టులు పెంచి రీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ ● లేకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరిక

తిరుపతి సిటీ: కూటమి సర్కార్‌ నిరుద్యోగ యువతను మరో మారు మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అర్భాటంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసి నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో అడుకుంటోంది. జిల్లాలోని ప్రభుత్వ, మున్సిపల్‌, కార్పొరేషన్‌ పరిధిలో నడుస్తున్న పాఠశాలల్లో వేలాదిగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం 87 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసి చేతులు దులుపుకుంది. గతంలో మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చేసి అర్హులకు అన్యాయం చేసిన కూటమి సర్కార్‌ మరో మారు నిరుద్యోగ యువతను నిలువునా ముంచేసేందుకు సిద్ధమైంది. పోస్టులే లేని డీఎస్సీ ఎందుకో అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

నిరుద్యోగులు 30 వేల మందిపైనే

డీఎస్సీ నోటిఫికేషన్‌ జిల్లాలో అర్హులైన డీఎస్సీ అభ్యర్థులను నిరాశ పరచింది. జిల్లాలో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు సుమారు 30వేలకు పైగా ఉన్నారు. ప్రధాన సబ్జెక్టులైన ఇంగ్లిష్‌, గణితం, ఫిజికల్‌ సైన్స్‌లో ఒక్క పోస్టును సైతం భర్తీ చేయకపోవడం గమనార్హం.

పోస్టులను కుదించేశారు

బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, డీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ కోసం వేయి కళ్లతో ఎదుచురు చూశారు. కానీ కూటమి సర్కార్‌ నిరుద్యోగల కళ్లలో కారం కొట్టింది. క్లస్టరైజేషన్‌, రేషనలైజేషన్‌ పేరుతో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను మూసివేసి ఉపాధ్యాయ పోస్టులను కుదించేసింది.

నవోదయ విద్యార్థులు అర్హులు కారా?

నవోదయ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులను డీఎస్సీకి అనర్హులుగా ప్రకటించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నవోదయ విద్యార్థుల పట్ల ఇలాంటి వివక్ష ఎందుకని విద్యావంతులు, నవోదయ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న అభ్యర్థులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement