నేడు వర్కింగ్‌ డే | - | Sakshi
Sakshi News home page

నేడు వర్కింగ్‌ డే

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

తిరుపతి అర్బన్‌: రెండో శనివారం అయినప్పటికి 14వ తేదీ ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ పనిచేస్తాయని సంబంధిత జిల్లా అధికారులు తెలిపారు. గత నెల 19న వర్కింగ్‌ డే అయినప్పటికీ సెలవు రోజుగా ప్రకటించారు. దీంతో రెండో శనివారం ప్రభుత్వ సెలవు రోజు అయినప్పటికీ వర్కింగ్‌ డేగా అధికారులకు తెలిపారు.

తిరుపతిలో 19న జాబ్‌మేళా

తిరుపతి అర్బన్‌: తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని ఎస్‌వీసీసీ డిగ్రీ కళాశాలలో ఈనెల 19న ఉదయం 9గంటల నుంచి జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికరి ఆర్‌.లోకనాథం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌ మేళాకు పది బహుళజాతి కంపెనీల ప్రతినిధులు హాజరైన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత అయిన యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. 18–35 ఏళ్ల యువతీయువకులు హాజరుకావచ్చని చెప్పారు. అదనపు సమాచారం కోసం 7207389948, 8886086072 నంబర్లలో సంప్రదించొచ్చని సూచించారు. ఆ మేరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు.

16న తిరుపతిలో జాబ్‌మేళా

తిరుపతి అర్బన్‌: తిరుపతి కరకంబాడీ రోడ్డులోని క్లాక్‌ ఓ అగ్రికల్చర్‌ సంస్థ కార్యాలయంలో ఈ నెల 16న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అధికారి పద్మజ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సూపర్‌ వైజర్ల పోస్టుకు బీటెక్‌, టెక్నీషియన్‌కు డిప్లోమా, మార్కెటింగ్‌కు ఎంబీఏ, ఎడిటింగ్‌ ఎడిటర్‌గా రెండేళ్ల అనుభవం ఉన్న పురుషులు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్స్‌తో సోమవారం క్లాక్‌ ఓ అగ్రికల్చర్‌ సంస్థ వద్దకు హాజరుకావాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 6303573030, 9505601887 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

డెంగీ, జికా వైరస్‌లపై

కీలక పరిశోధనలు

ఏర్పేడు (రేణిగుంట): ప్రమాదకర డెంగీ, జికా వైరస్‌లతో తిరుపతి ఐసర్‌ బయాలజీ విభాగం ప్రొఫెసర్‌ గురుప్రసాద్‌ ఆర్‌. మెడిగేశి నేతృత్వంలో బ్రిక్‌–టిహెచ్‌ఎస్టిఐ ఫరీదాబాద్‌, న్యూఢిల్లీకి చెందిన జామియా హమ్దార్డ్‌ పరిశోధకుల సహకారంతో కీలక పరిఽశోధనలు చేశారు. న్యూఢిల్లీ నగర శివారు ప్రాంతాల్లో జికా, డెంగ్యూ వైరస్‌ల సహ–వ్యాప్తిపై కీలక పరిశోధనలు చేశారు. వీరి పరిశోధనల్లో కమ్యూనిటీ కోహోర్ట్‌లో నిర్వహించిన సీరో–సర్వైలెన్స్‌లో డెంగ్యూ వైరస్‌, జికా వైరస్‌ రెండింటిపై ప్రతిస్పందించే యాంటీబాడీలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇది రెండు వైరస్‌లు కలిసి వ్యాపించే అవకాశం ఉంది. అధ్యయనంలో సంచిత జికా వ్యాప్తి రేటు 7.3 శాతంగా గుర్తించారు. వైరస్‌ల వ్యాప్తిలో మార్పులను గుర్తించడానికి, భవిష్యత్తులో వ్యాప్తి నివారణ, నిర్వహణకు మార్గనిర్దేశం చేయడానికి, జ్వరంతో బాధపడుతున్న రోగులు, డెంగ్యూ కేసులు, వ్యాధి వాహకాల నిల్వలపై నిరంతర నిఘా ఉంచాలని ఈ పరిశోధనల ద్వారా వెల్లడైందన్నారు.

ఆ సేవలు తాత్కాలిక నిలిపివేత

తిరుపతి ఎడ్యుకేషన్‌ : శ్రీకాళహస్తి, చంద్రగిరి ప్రధాన తపాల కార్యాలయాల పరిధిలోని అన్ని అనుబంధ తపాల కార్యాలయాల్లో పోస్టల్‌ జీవిత బీమా (పీఎల్‌ఐ), రూరల్‌ పోస్టల్‌ జీవిత బీమా (ఆర్‌పీఎల్‌ఐ) సేవలను ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఆ మేరకు తిరుపతి డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీస్‌ మేజర్‌ సైదా తన్వీర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టల్‌ శాఖలో నూతన ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఐఎంఎస్‌) అమలులో భాగంగా ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ పాలసీదారులు ప్రీమియం చెల్లింపులు, ఇతర అత్యవసర పాలసీ సంబంధిత లావాదేవీలను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని ఆమె కోరారు. తిరిగి 25వ తేదీ నుంచి ఈ సేవలు పునఃప్రారంభమవుతాయని ఆమె పేర్కొన్నారు.

పరిపూర్ణం.. సుబ్రమణ్య హోమం

తిరుపతి కల్చరల్‌ : శ్రీకపిలేశ్వరస్వామి వారి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సుబ్రమణ్యస్వామి హోమం శుక్రవారంతో పరిపూర్ణమైంది. ఈ సందర్భంగా యాగశాలలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన చేపట్టారు. స్వామివారికి మహాభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి సమర్పించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీవళ్లీ, దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామివారికి కల్యాణోత్సవం జరిపించారు. డిప్యూటీ ఈఓ నాగరత్న, ఏఈఓ కుమారీదేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement