తిరుపతి ఎడ్యుకేషన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్–17 జూడో బాలబాలికల జట్లు ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి జూడో క్రీడాకారులు హాజరయ్యారు. బాలబాలికలకు వేర్వేరుగా ఎంపిక పోటీలను నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శులు సాంబశివరావు, అమ్ములు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు కాకినాడలో నిర్వహించనున్న ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. డీఎస్డీఓ ఎన్.శశిధర్, వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రశేఖర్‌రాజు, ముద్దుకృష్ణ, ప్రసన్న, విద్యాలత, రూపులత, పుష్ప వాణి పాల్గొన్నారు.


