తిరుపతి క్రైం: తిరుపతిలోని కళ్యాణి రెసిడెన్సీ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు, ఇతర ఆధారాలు లభించకపోవడంతో అతని వివరాలు తెలియరాలేదు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
వేధింపులపై ఫిర్యాదు
నాయుడుపేట టౌన్:హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న అరున్పాండే అనే వ్యక్తి అదే కంపెనీలో పనిచేస్తున్న నాయుడుపేటకు చెందిన ఓ యువతిని ఏఐ ద్వారా ఫొటోలో మార్పింగ్ చేస్తూ తను చెప్పినట్లు వినక పోతే సోషల్ మాద్యమాల్లో ఫొటోలు పోస్టుచేస్తానని బెదిరిస్తున్నట్టు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో 2024లో నాయుడుపేటకు చెందిన యువత ఉద్యోగంలో చేరింది. అక్కడ మేనేజర్‌గా పనిచేస్తున్న అరుణ్‌పాండే అనే వ్యక్తి తరచూ ఆమె పనిచేస్తున్న క్యాబిన్ వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రిజైన్‌చేసి వచ్చేసినప్పటికీ అరుణ్‌పాండే తన ల్యాప్‌టాప్‌లలో ఉన్న ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని వాటిని మార్పింగ్చేసి తన తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులకు పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు లో పేర్కొంది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


