ట్రాక్టర్‌ బోల్తాపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తాపడి వ్యక్తి మృతి

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

వెంకటగిరి రూరల్‌: వ్యవసాయ పొలాల్లో ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన బాలాయపల్లి మండలంలోని జయంపు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం.. జయంపు గిరిజన కాలనీకి చెందిన శనగ పెద్ద సంజీవయ్య(37) జయంపు సమీపంలోని ఓ రైతు వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌ ద్వారా దుక్కి దున్నుతున్నాడు. ఈ క్రమంలో పొలంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ట్రాక్టర్‌పై ఉన్న సంజీవయ్య బురదలో ఇరుక్కపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత జేసీబీ సహాయంతో ట్రాక్టర్‌ను పక్కకు నెట్టి సంజీవయ్య మృతదేహాన్ని వెలికి తీవారు. సంజీవయ్య మృతితో జయంపులో విషాదం అలముకుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement