మహిళా అంతర్‌ కళాశాలల టోర్నమెంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మహిళా అంతర్‌ కళాశాలల టోర్నమెంట్‌ ప్రారంభం

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

తిరుపతి సిటీ: ఎస్వీయూ మహిళా అంతర్‌ కళాశాలల క్రీడా టోర్నమెంట్‌ను వీసీ టాటా నర్సింగరావు ప్రారంభించారు. మంగళవారం ఎస్వీయూ స్టేడియంలో ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌కు ఎస్వీయూ పరిధిలోని సుమారు 25 కళాశాలల క్రీడాకారిణులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బాస్కెట్‌ బాల్‌ పోటీలలో ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థినులు అత్యత్తమ ప్రతిభ కనబరచి విజేతలుగా నిలిచారు. వాలీబాల్‌, ఖోఖో క్రీడలలో పద్మావతి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల విద్యార్థినులు విజేతలుగా నిలవగా, బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలలో శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల క్రీడాకారిణులు ప్రథమ స్థానం కై వసం చేసుకున్నారు. అనంతరం ఎస్వీయూ రెక్టార్‌ చెండ్రాయుడు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎం.శివశంకర్‌రెడ్డి విజేతలకు ట్రోఫీలను, ప్రశంసాపత్రాలను అందజేశారు. ప్రిన్సిపల్‌ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement