రవాణాశాఖ అధికారుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

రవాణాశాఖ అధికారుల తనిఖీలు

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తిరుపతి జిల్లా రవాణాశాఖ అధికారులు మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అధిక వేగంతో ప్రయాణిస్తున్న రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అందిన సమాచారం మేరకు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఒక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుతో పాటు, హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వస్తున్న మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అధిక వేగంతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. రవాణా శాఖ అధికారులు సంబంధిత బస్సులను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్‌ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల యాజమాన్యాలు తప్పనిసరిగా నిర్దేశించిన వేగ పరిమితులను పాటించాలన్నారు. రాష్ట్ర రవాణా శాఖ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా బస్సుల వేగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చెప్పారు. తనిఖీల్లో మోటార్‌ వాహన తనిఖీ అధికారులు స్వర్ణలత, ప్రసాద్‌ వర్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement