– కూటమి నేతల కవ్వింపు చర్యలు
పుల్లంపేట: మండలంలోని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మండల బూత్ కమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్‌రెడ్డి కారు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇరువురు వ్యక్తులు బైక్‌పై వచ్చి మండల కేంద్రంలోని ఇంటి బయట పార్క్ చేసి ఉన్న కారు పక్కనే ఉన్న బండరాళ్లతో కారు ముందు, వెనుక అద్దాలను ధ్వంసం చేశారు. ఉదయం నిద్రలేచి చూడగా కారు అద్దాలను పగులగొట్టి ఉండడాన్ని గుర్తించిన సుదర్శన్‌రెడ్డి సమీపంలోని పార్టీ కార్యకర్తలకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఇరువురు వ్యక్తులు బైక్‌పై వచ్చి దుశ్చర్యలకు పాల్పడినట్లు గుర్తించారు. బైక్ వెలుతురులో సీసీ కెమెరాలో నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపించకపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. కాగా బాధితుడు మాట్లాడుతూ కూటమి నేతల కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఏవైనా ఉంటే ఎదురుగా వచ్చి ధైర్యంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.


