వైఎస్సార్‌సీపీ నాయకుడి కారు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుడి కారు ధ్వంసం

Nov 10 2026 1:43 AM | Updated on Nov 10 2026 1:43 AM

– 8లో

న్యూస్‌రీల్‌

రైల్వేకోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలంలో వైఎస్సార్‌సీపీ నాయకుడి కారు అద్దాలు ధ్వంసం చేశారు.

మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

తొట్టంబేడు.. కట్టబెట్టారు చూడు

తొట్టంబేడు మండల జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో మొదటి మూడు రౌండ్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉన్నం వాసుదేవనాయుడు ఆధిక్యంలో ఉన్నారు. ఆ సమయంలో ఎన్నికల అధికారులకు పలు మార్లు ఫోన్లు వచ్చాయి. ఫోన్‌ వచ్చిన సమయంలో దూరంగా వెళ్లి మాట్లాడి రావడం కనిపించిందని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు చెబుతున్నారు. ఆ తరువాత టీడీపీ ఏజెంట్‌ ఒకరు రెండు ఓట్ల కట్టలను బయటపడేశాడు. మరో వైపు అరగంట పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ ఉన్నా వినియోగించ లేదు. ఈ రెండు పరిణామాల తరువాత టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారు. అదేవిధంగా తొట్టంబేడు మండలం, తాటిపర్తి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి 3 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రీ కౌంటింగ్‌కి డిమాండ్‌ చేసినా పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో 35 చెల్లనివిగా చూపించడంపై ఆ పార్టీ అభ్యర్థి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement