వైఎస్సార్‌సీపీ నేతలకు పరామర్శ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలకు పరామర్శ

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లా జైలులో ఉన్న పుంగనూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేతలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పరామర్శించారు. పుంగనూరు మున్సిపల్‌ ఎన్నికల సమయంలో నామినేషన్‌ వేయడానికి వెళ్లిన పలువురు నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అందులో పుంగనూరు నియోజకవర్గం నుంచి 16 మందిని అరెస్టు చేశారు. వారిని పెద్దిరెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం పెద్దిరెడ్డికి ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు పుష్పలత, తమిళ అరసి, షమ్మాను చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పరిచయం చేశారు. ఈ క్రమంలోనే ఆయన కట్టమంచిలో స్థానిక నేత దినేష్‌రెడ్డి నివాసంలో నాయకులతో కాసేపు ముచ్చటించారు. ఎన్నికల సందర్భంగా జరిగిన పలు గొడవలు, విషయాలను విజయానందరెడ్డి వివరించారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్‌, నేతలు పరమేశ్వరరెడ్డి, బాబీ, మనోహర్‌రెడ్డి, అన్బు, మనోజ్‌రెడ్డి, హమీద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement