వెంకటగిరి రూరల్/గూడూరు: పాత కక్షల నేపథ్యంలో సొంత అన్నపై దాడిచేసి హత్య చేసిన ఘటనలో నిందితుడికి గూడూరు కోర్టు జీవిత ఖైదు విధించినట్టు ఏపీపీ వసంతకుమార్ తెలిపారు. డక్కిలి మండలం సంగనపల్లి గ్రామానికి చెందిన శనగ అంకయ్య, శనగా శ్రీరాములుకు పాత కక్షలున్నాయి. ఈ క్రమంలో శ్రీరాములు తన అన్న అంకయ్యపై 2017లో కర్రతో తలపై దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందడంతో డక్కిలి పోలీసులు విచారణ చేసి హత్యగా కేసు నమోదుచేశారు. శ్రీరాములును అరెస్ట్ చేసి చార్జిషీట్‌ను కోర్టుకు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి వెంకట నాగపవన్ వెల్లడించారు. ముద్దాయికి జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధించినట్లు విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరునెలలు శిక్షను అనుభవించాలని ఉత్తర్వులు ఇచ్చారు. కేసును త్వరగా పూర్తి చేయడంలో వెంకటగిరి సీఐ, సిబ్బందితోపాటు, కోర్టు లైజనింగ్ అధికారి మల్లికార్జున్, కోర్టు కానిస్టేబుల్ రామకృష్ణ సహకారం అందించారని ఏపీపీ తెలిపారు.


