శ్రీకాళహస్తి రూరల్(తొట్టంబేడు): శ్రీకాళహస్తి మండలం, మేలచ్చూరు గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. రూరల్ సీఐ ఇబ్రహీం కథనం.. మేలచూరుకు చెందిన వెంకటరమణ ఇంట్లో గురువారం రాత్రి దొంగలు చొరబడి ఇంటి తాళాలు పగులుగొట్టారు. ఇంట్లో ఉన్న 20 గ్రాములు బంగారం, రూ.5 వేల నగదు దోచుకెళ్లారు. ఇంటి యజమాని ఉద్యోగ నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడు. సమాచారం తెలుసుకున్న బాధితుడు శుక్రవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
శ్రీవారి సేవలో ప్రపంచ
చెస్ చాంపియన్ గుకేష్
తిరుమల: ప్రపంచ చెస్ చాంపియన్ గుకేష్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
ప్రళయానికి ఎడాది
కేవీబీపురం: కేవీబీపురం మండలంలోని ఓళ్లూరు రాయలచెరువు తుపాన్ కారణంగా 2025 నవంబర్ 6న తెగిపోయి కళత్తూరు ఎస్సీ కాలనీ జలమయమైంది. ఆ ఘోర ఘటనను తలచుకొని గ్రామంలో ఉన్న క్రైస్తవ సేవకులు, క్రైస్తవులు కొవ్వొత్తులు చేతబట్టి మౌన ర్యాలీ నిర్వహించి ప్రత్యేక ప్రార్థన చేశారు. దేవుడే కాపాడాడని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన యువకులు పారిశుద్ధ్య పనులు స్వచ్ఛందంగా నిర్వహించారు.
శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ
చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలను శుక్రవారం రెండో రోజు వైభవంగా నిర్వహించారు. స్వామివారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేపట్టి, శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పించారు. ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన జరిపించాఇరు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని యాగశాలకు వేంచేపు చేసి పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర వైదిక కార్యక్రమాలు చేశారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామివారి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు మూలవర్లకు, ఉత్సవమూర్తులకు పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై విహరించారు. ఆలయ స్పెషల్ డెప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ హరికృష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు ధనశేఖర్, ముని కుమార్ పాల్గొన్నారు.


