బాధితులపైనే అక్రమ కేసులా? | - | Sakshi
Sakshi News home page

బాధితులపైనే అక్రమ కేసులా?

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ను అడ్డుకుంటే నిందితులుగా ముద్ర చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, మొగరాల హరిప్రసాద్‌రెడ్డి సహా పలువురిపై కేసులు దాడిలో గాయపడిన వారిపైనా ఎఫ్‌ఐఆర్‌ పోలీసుల తీరుపై విమర్శలు

తిరుపతి రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ జరిగాయని ఆరోపిస్తూ రీపోలింగ్‌ కోరిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల అక్రమాలను ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రగిరి టవర్‌క్లాక్‌ వద్ద గురువారం రీపోలింగ్‌ కోరుతూ నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థులు కొటాల పద్మజ, శ్రీలేఖ తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రామచంద్రాపురం మండలం, సీకేపల్లిలో ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త మోదుపాలెం ధనంజయరెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితునికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడిని అడ్డుకున్న మహిళలు హేమలత, సౌజన్యను సైతం ఆ కేసులో చేర్చారు. పాకాల మండలం మద్దినాయునిపల్లిలో ఈ నెల 5న పోలింగ్‌ సందర్భంగా రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ అయ్యవారిపల్లి కాంప్లెక్స్‌ వద్ద రీపోలింగ్‌ కోరుతూ నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు మొగరాల హరిప్రసాద్‌రెడ్డితో పాటు పార్టీ నేతలు యుగంధర్‌, సుధాకర్‌, మధు, వెంకటేష్‌ తదితరులపై పాకాల పోలీసులు కేసులు నమోదు చేశారు. దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ ఆరోపణలపై విచారణ జరపకుండా నిరసన తెలిపిన వారిపైనా, దాడిలో గాయపడిన వారిపైనా కేసులు నమోదు చేయడమేంటని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల ఏకపక్ష వైఖరిపై మండిపడుతున్నారు. తిరుపతి రూరల్‌ మండలం, సాయినగర్‌ పంచాయతీ పరిధిలో దొంగ ఓట్లను అడ్డుకుంటున్న జనరల్‌ ఏజెంట్‌ శశిధర్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి సాయంత్రం వరకు పోలిస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement